‘శనగ విత్తనాలు పంపిణీ చేయాలి’

ABN , First Publish Date - 2022-10-08T06:08:46+05:30 IST

రైతులకు శనగ విత్తనాలను వెంటనే పంపిణీ చేయాలని ఏపీ రైతు సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకుడు భాస్కర్‌రెడ్డి, రాజు, పక్కీర్‌సాహెబ్‌ డిమాండ్‌ చేశారు.

‘శనగ విత్తనాలు పంపిణీ చేయాలి’
వినతి పత్రం అందజేస్తున్న రైతు సంఘం నాయకులు

నందికొట్కూరు రూరల్‌, అక్టోబరు 7: రైతులకు శనగ విత్తనాలను వెంటనే పంపిణీ చేయాలని ఏపీ రైతు సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకుడు భాస్కర్‌రెడ్డి, రాజు, పక్కీర్‌సాహెబ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం నందికొట్కూరు వ్యవసాయ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం వ్యవసాయ కార్యాలయ టెక్నికల్‌ అధికారి కల్లీమున్నిసాకు వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ శనగ విత్తనాల కాలం ముగిశాక పంపిణీ చేస్తే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలలో రైతకు శనగ వితనాలు పంపిణీ చేశారని, అయితే నందికొట్కూరు మండలంలో పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఖరీఫ్‌ కాలంలో అతి వృష్టి వల్ల దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అంచనాలు వేయడంలో రైతులకు పరిహారం అందిచడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రబీ కాలం మెదలై 10 రోజులైనా రైతులకు శనగ విత్తనాలు పంపిణీ చేయడంలేదన్నారు. మండలానికి 13 వందల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం కాగా కేవలం 200 క్వింటాళ్ళు మాత్రమే మంజూరు అయ్యాయని తెలపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రైతు సంఘం నాయకులు గోపాలక్రిష్ణ, మశన్న, శ్రీనివాసులు, తిక్కస్వామి, నూర్జాహాన్‌, బీబీ, పాల్గొన్నారు.

Read more