వైభవంగా దసరా

ABN , First Publish Date - 2022-10-07T05:59:14+05:30 IST

నంద్యాల జిల్లాలోని నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాల్లో విజయదశమి పర్వదిన వేడుకలను బుధవారం పట్టణాలు, గ్రామాల్లో వైభవంగా నిర్వహించారు.

వైభవంగా దసరా
నంద్యాల(కల్చరల్‌): నంద్యాలలోని ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్న భక్తులు

నంద్యాల జిల్లాలోని నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం,  పాణ్యం నియోజకవర్గాల్లో  విజయదశమి పర్వదిన వేడుకలను బుధవారం పట్టణాలు, గ్రామాల్లో వైభవంగా నిర్వహించారు.  దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ, గ్రామోత్సవాన్ని నిర్వహించారు. వివిధ వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలకు నిమజ్జనం చేశారు. జమ్మి చెట్టు వద్ద పూజలు చేశారు. శమీ ఆకులను ఇచ్చి పుచ్చుకుని ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో వివిధ అలంకరణల్లో దర్శనమిచ్చిన అమ్మవారు పండుగ రోజున నిజరూప దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read more