వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంకండి
ABN , First Publish Date - 2022-12-31T01:06:27+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నిరుద్యోగులు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు.
యువగళం పాదయాత్రను విజయవంతం చేయండి
మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత పిలుపు
కల్లూరు, డిసెంబరు 30: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నిరుద్యోగులు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు. శుక్రవారం కల్లూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనం తరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. 400 రోజులు 4000 కిలోమీటర్లు పాద యాత్ర చేపట్టనున్న మాజీ మంత్రి నారా లోకేష్ యువతను తట్టిలే పుతూ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించ నున్నారని తెలిపారు. ఉద్యోగాల్లేక యువత అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో యువగళం పాదయాత్రను విజయవంతం చే యాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెరుగు పురుషోత్తంరెడ్డి, కె.పార్వతమ్మ, ఆకెపోగు వెంకటస్వామి, బాల వెంకటేశ్వరెడ్డి, ప్రభాకర్ యాదవ్, మహేష్‌గౌడు, గంగాధర్‌గౌడు, ఫిరోజ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, పీయూ మాదన్న, కల్లూరు మండల టీడీపీ కన్వీనర్ డి.రామాంజనే యులు, వాకిటి మాదేష్, ఎన్వీ రామకృష్ణ, పవన్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కర్నూలు(రూరల్): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ చేపట్టే పాదయాత్రను విజయవంతం చేద్దామని కోడుమూరు నియోజ కవర్గ ఇన్‌చార్జి ప్రభాకర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే నెల 27వ తేదీ నుంచి రాష్ట్రంలో కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేయనున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో నాయకులు వంశీధర్‌రెడ్డి, బోయ వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్, సత్రం రామకృష్ణుడు, సయ్యద్, సోఫీ బేగ్, గంగారామ్ పాల్గొన్నారు.
గూడూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేద్దామని పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్ నాయుడు అన్నారు. శుక్రవారం గూడూరులో గజేంద్ర గోపాల్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గజేంద్ర గోపాల్ నాయుడు మాట్లాడుతూ జనవరిలో లోకేష్ యువ గళం పేరుతో 400 రోజలు పాటు 4వేల కీలో మీటర్లు పాదయాత్రను నిర్వహించనున్నారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సుధా కర్ రెడ్డి, దండు సుందరరాజు, ఎస్ ఎ సలీం, మన్నన్ బాష, నాగప్ప యాదవ్, కళ్యాణ్ రఘు, సులేమాన్, ఇబ్రహీం తదితరలు పాల్గొన్నారు.