ఉపాధి కార్యాలయంలో ఎగరని జెండా
ABN , First Publish Date - 2022-08-16T06:48:23+05:30 IST
ఓర్వకల్లులోని ఉపాధి హామీ పథకం కార్యా లయంలో, హౌసింగ్ కార్యాల యంలో సువర్ణ పఽతాకం జెండాను ఎగుర వేయక పోవడంతో ప్రజలు అధికా రుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓర్వకల్లు, ఆగస్టు 15: ఓర్వకల్లులోని ఉపాధి హామీ పథకం కార్యా లయంలో, హౌసింగ్ కార్యాల యంలో సువర్ణ పఽతాకం జెండాను ఎగుర వేయక పోవడంతో ప్రజలు అధికా రుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి జెండా అందించి, కట్టినప్పనప్పటికీ ఉపాధి కార్యాలయం, హౌసింగ్ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించకపోవడం బాధాకరమన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సువర్ణపతాకం వలంటీర్లు కొద్ది మంది మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే వాటితో పాటు కర్రలు కూడా ప్రభుత్వం సరఫరా చేసినప్పుటికీ ఆ కర్రలను ఎంపీడీవో కార్యాలయం బయట పడవేయ డంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.