అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
ABN , First Publish Date - 2022-03-05T05:44:55+05:30 IST
మహానంది క్షేత్రంలో భక్తుల కోసం నిర్వహిస్తున్న అన్నదాన పఽథకానికి విజయవాడకు చెందిన శివనాగిరెడ్డి, లక్ష్మీ రాజ్యం దంపతులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
మహానంది, మార్చి 4: మహానంది క్షేత్రంలో భక్తుల కోసం నిర్వహిస్తున్న అన్నదాన పఽథకానికి విజయవాడకు చెందిన శివనాగిరెడ్డి, లక్ష్మీ రాజ్యం దంపతులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. శుక్రవారం ఆలయంలో దాతలు అన్నదాన పథకానికి విరాళం ఇవ్వగా ఈవో చంద్రశేఖర్‌రెడ్డి శాలువతో సన్మానించి ప్రసాదాలు, స్వామివారి మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, వేదపండితులు నాగేశ్వరశర్మ, రాజమాణిక్యశర్మ పాల్గొన్నారు.