టిడ్కో ఇళ్ల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-24T05:52:37+05:30 IST

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు.

టిడ్కో ఇళ్ల పంపిణీ

ఎమ్మిగనూరు, సెప్టెంబరు 23: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్‌ ప్రాంతంలో నిర్మించిన టిడ్కో గృహాలను ప్రారంభించి, లబ్ధిదారుకు తాళాలు, ఇంటి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు రూ.6.50 లక్షలతో ఇంటిని నిర్మించి రూపాయికే రిజిస్ర్టేషన్‌ చేసి ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 2500 ఇళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు తీసుకొని ఉండి ఉంటే రూ.7.20 లక్షల అప్పు లబ్ధిదారులపై మోపేదని చెప్పారు. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఇదిలా ఉండగా సభలో రాష్ట్ర వీరశైవలింగాయత్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ వై రుద్రగౌడ్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం చర్చనీయాం శంగా మారింది. మంత్రి మాట్లాడుతున్న సమయంలో సభ చివరిలో కూర్చున్న మహి ళలు వెళ్లిపోవటంతో ఖాళీకుర్చీలు దర్శనమిచ్చాయి. కార్యక్రమంలో జేసీ రామసుంద ర్‌రెడ్డి, టిడ్కో చైర్మన్‌ ప్రసన్న కుమార్‌, టిడ్కో ఎండీ శ్రీధర్‌, ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు వై రుద్రగౌడ్‌, బుట్టా శారదమ్మ, మున్సిపల్‌ చైర్మన్‌ డా. రఘు, వైస్‌ చైర్మన్లు నజీర్‌ అహ్మద్‌, దివ్యకళ, మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌ గంగిరెడ్డి, కౌన్సిలర్‌ అమానుల్లా, నాయకులు బుట్టా రంగయ్య, రియాజ్‌,రాజు, సునీల్‌ పాల్గొన్నారు.

Read more