కుందూనదిలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-18T05:08:01+05:30 IST

మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో స్నానానికి వెళ్లిన యువకుడు దూదేకుల పదమయోగం (30) కుందూనదిలో పడి మృతి చెందాడు.

కుందూనదిలో యువకుడి మృతి

దొర్నిపాడు, ఆగస్టు 17: మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో స్నానానికి వెళ్లిన యువకుడు దూదేకుల పదమయోగం (30) కుందూనదిలో పడి మృతి చెందాడు. ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాలివీ.. పదమయోగం అనే వ్యక్తి రోజూ సాయంత్రం కుందూలో స్నానానికి వెళ్లేవాడు. రోజులాగే మంగళవారం సాయంత్రం కూడా స్నానానికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, మిత్రుల వద్ద కుటుంబీకులు విచారించిన ఫలితం లేక పోయింది. బుధవారం కుందూనదిలో శవమై తేలాడు. తండ్రి నాగన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 


 

 

Read more