అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ABN , First Publish Date - 2022-11-16T00:30:10+05:30 IST

నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా శ్రీశైల దేవస్థానం మంగళవారం సాయంత్రం సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నృత్యం చేస్తున్న కళాకారులు

శ్రీశైలం, నవంబరు 15: నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా శ్రీశైల దేవస్థానం మంగళవారం సాయంత్రం సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో యమ్‌. పరమేశ్వర్‌, నృత్యరవళి కళాక్షేత్రం, హనుమకొండ బృందంచే కార్యక్రమాన్ని నిర్వహించారు.

విశేష పూజలు

శ్రీశైల క్షేత్రంలో మంగళవారాన్ని పురస్కరించుకొని లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమారస్వామి) స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విరిసిల్లాలని అర్చకులు సంకల్పం పఠించి, మహాగణపతికి పూజలు చేశారు. అనంతరం బయలు వీరభద్రస్వామికి,, నందీశ్వరస్వామికి విశేష అర్చనలు చేశారు.

Updated Date - 2022-11-16T00:30:10+05:30 IST

Read more