అనాథ శవానికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-12-12T00:59:30+05:30 IST

పట్టణంలో అనాథ శవానికి గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు.

అనాథ శవానికి అంత్యక్రియలు

కోడుమూరు (రూరల్‌), డిసెంబరు 11: పట్టణంలో అనాథ శవానికి గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంలో సుమారు 50 ఏళ్ల పైబడిన వ్యక్తి గత కొన్ని నెలలుగా ఉంటున్నాడు. అతనికి మతిస్థిమితం కూడా సరిగా లేదు. స్థానిక హోటళ్ల దగ్గర యాచించి కడుపునింపుకుంటున్నాడు. రాత్రి సమయాల్లో దుకాణాల మెట్లపై నిద్రిస్తూ రోజులు గడుపుతున్నాడు. శనివారం రాత్రి వర్షపు జల్లులకు తోడు చలిగాలులు వీయడంతో కొత్తబస్టాండ్‌ సమీపంలో ఓ రేకుల షెడ్‌లో నిద్రించాడు. అయితే ఉదయం ఆ వ్యక్తి ఉలుకూపలుకు లేకుండా పడి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సర్పంచ్‌ భాగ్యరత్నమ్మ దృష్టికి తీసుకవచ్చారు. స్పందించిన సర్పంచ్‌, గ్రామ పంచాయితీ సిబ్బంది సాయంతో అనాథ శవానికి హంద్రీ సమీపంలో అంత్యక్రియలు జరిపించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకుడు ఆంధ్రయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:59:30+05:30 IST

Read more