పడిపోయిన పత్తి ధర

ABN , First Publish Date - 2022-12-07T00:20:36+05:30 IST

పత్తి ధరలు తగ్గుతున్నాయి. ఒక్క రోజులోనే క్వింటానికి రూ.300 పైగా ధర తగ్గింది. ధరలు పతనమవుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 పడిపోయిన పత్తి ధర

ఒక్క రోజులోనే రూ.300 పతనం

ఆదోని(అగ్రికల్చర్‌), డిసెంబరు 6: పత్తి ధరలు తగ్గుతున్నాయి. ఒక్క రోజులోనే క్వింటానికి రూ.300 పైగా ధర తగ్గింది. ధరలు పతనమవుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధర గరిష్టంగా క్వింటాలుకు రూ.8600 పలికింది. అక్టోబరులో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు పత్తి పంట భారీగా దెబ్బతింది. పురుగులు, తెగుళ్లు అధికంగా సోకడం, వర్షాలకు నల్లబారిపోవడం వల్ల నాణ్యత దెబ్బతింది. దిగుబడి కూడా అంతంత మాత్రమే రావడంతోపాటు ధరలు పతనమవుతుండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. 3013 క్వింటాలు పత్తి మార్కెట్‌ యార్డుకు విక్రయానికి రాగా... కనిష్ఠధర రూ.5,369, గరిష్ఠ ధర రూ.8,600, మధ్యస్థ ధర రూ. 8,389 పలికింది.

Updated Date - 2022-12-07T00:20:40+05:30 IST