ఖరీఫ్‌కు సిద్ధం కావాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-04-20T05:49:33+05:30 IST

జిల్లాలో రైతులు సాగు చేసే పంటల వివరాలు తెలుసుకొని ఖరీఫ్‌ సీజన్‌కు సమాయత్తం కావాలని వ్యవసాయ శాఖాధికా రులను కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆదేశించారు.

ఖరీఫ్‌కు సిద్ధం కావాలి: కలెక్టర్‌
సమీక్షిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌

నంద్యాల టౌన్‌, ఏప్రిల్‌ 19: జిల్లాలో రైతులు సాగు చేసే పంటల వివరాలు తెలుసుకొని ఖరీఫ్‌ సీజన్‌కు సమాయత్తం కావాలని వ్యవసాయ శాఖాధికా రులను కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో వ్యవ సాయ, అనుబంధ రంగాలైన ఉద్యాన, పశుసంవర్థక, మత్స్యశాఖ, పట్టు పరిశ్రమ, మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లయ్‌ తదితర శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఆయన  మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో రైతులు నష్ట పోకుండా పూర్తిస్థాయి ప్రణాళికతో  ఖరీఫ్‌కు సిద్ధం కావాలని సూచించారు. పంటల సాగుకు అవసర మయ్యే విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు బయట కొనుగోలు చేయకుండా రైతుభరోసా కేంద్రా ల్లోనే కొనుగోలు చేసేలా రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల పరిస్థితిని వ్యవసాయాధికారులతో కలెక్టర్‌ ఆరా తీశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవ సాయ, అనుబంధ రంగాల గ్రామస్థాయి అధికారులు రైతులకు అందు బాటులో ఉండి పంటలపై వచ్చే చీడ, పీడలు, పొలం బడి శిక్షణా కార్యక్రమాలు, వివిధ పంటలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి సాగును లాభ సాటిగా చేసేందుకు వ్యవసాయ, వ్యవసాయ అను బంధ రంగాల అధికారులు కృషి చేయాలని అన్నారు. రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించు కొని ఏ పంట వేసుకుంటే రైతు లాభం పొందుతాడో, సంబంధిత పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ప్రాథమిక వైద్యంతోపాటు పాడి రైతులకు కావాల్సిన దాణా, పశుగ్రాసం తదితరాలను సరఫరా చేయాలని ఆదేశించారు. ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమయ్యే వేరుశనగ, కంది, మినుము, పెసర, జొన్న, కొర్ర పంటలకు అవసరమయ్యే విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు పాల్గొన్నారు. 


‘ప్రజలకు సేవ చేయండి’


ప్రజల వద్దకు వైద్యాన్ని తీసికెళ్లి అంకిత భావంతో వారికి మెరుగైన సేవలు అందించాలని   కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నంద్యాల మున్సిపల్‌ టౌన్‌హాల్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ - ఆరోగ్య మేళా కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మున్సిపల్‌ చైౖర్‌పర్సన్‌ మాబున్నీసా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఓ. ప్రభావతి, ఆయుష్మాన్‌ వైద్యాధికారి డాక్టర్‌ యశోధర ఈ మేళాలో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం  ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఆరోగ్య మేళాను నిర్వహిస్తోందని తెలిపారు. ఆరోగ్య మేళాలో 2156 మందికి వైద్య  పరీక్షలు నిర్వహించి చికిత్స చేయడం అభినందనీయమన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ప్రభావతి మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ సేవలు, వ్యాక్సి నేషన్‌, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత  పరీక్షలు చేయించినట్లు తెలి పారు.  ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.అంకిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణ, వైద్యులు డాక్టర్‌ చిన్న లింగన్న, డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌, డాక్టర్‌ కాంతారావు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-20T05:49:33+05:30 IST