26లోగా క్లైమ్స్‌, అబ్జెక్షన్స్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-15T23:34:51+05:30 IST

స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో వచ్చిన క్లైమ్స్‌, అబ్జెక్షన్స్‌కు డిసెంబరు 26వ తేదీ ఆఖరు కావడంతో అంతలోపు వాటిని పూర్తి చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

 26లోగా క్లైమ్స్‌, అబ్జెక్షన్స్‌ పూర్తి చేయాలి

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా

కర్నూలు(కలెక్టరేట్‌) డిసెంబరు 15: స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో వచ్చిన క్లైమ్స్‌, అబ్జెక్షన్స్‌కు డిసెంబరు 26వ తేదీ ఆఖరు కావడంతో అంతలోపు వాటిని పూర్తి చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లైమ్స్‌, అబ్జెక్షన్స్‌ సంబంధించి జీరో పెండెన్సీ ఉండేలా చూడాలన్నారు. ఫొటో సిమిలర్‌ ఎంట్రీస్‌ లేకుండా బూత్‌ స్థాయి అధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. వాటికి సంబంధించి చెక్‌ లిస్ట్‌ జెనరేట్‌ చేసి బూత్‌ స్థాయి అధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. వాటికి సంబంధించి చెక్‌ లిస్ట్‌ జెనరేట్‌ చేసి బూత్‌ స్థాయి అధికారులకు పంపాలన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ ఫామ్‌-6బి కి సంబంధించి 63 శాతం పూర్తి చేశామని జనవరి నాటికి వంద శాతం పూర్తి చేస్తామన్నారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో భాగంగా 21,884 పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ఈనెల 25 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవ్‌ తేజ, డిఆర్వో నాగేశ్వరరావుదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:34:55+05:30 IST