పేరు మార్చడం మూర్ఖత్వం

ABN , First Publish Date - 2022-09-23T05:00:37+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం మూర్ఖపు చర్య అని టీడీపీ నాయకులు మండిపడ్డారు.

పేరు మార్చడం మూర్ఖత్వం
డోన్‌లో జీవో ప్రతులను దహనం చేస్తున్న టీడీపీ నాయకులు

కొత్త వర్సిటీలను ఏర్పాటు చేసి మీ తండ్రి పేరు పెట్టుకోండి
టీడీపీ నాయకుల ఆందోళన


ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం మూర్ఖపు చర్య అని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎస్సార్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్తగా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి మీ తండ్రి పేరు పెట్టుకోవచ్చని సీఎం జగన్‌కు సూచించారు. హెల్త్‌ వర్సిటీ పేరు మార్చడమంటే ఎన్టీఆర్‌ను అవమానించడమే అన్నారు.

నంద్యాల (నూనెపల్లె), సెప్టెంబరు 22: హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చడం మూర్ఖపు చర్య అని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్‌ చేశారు. నంద్యాల తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభు త్వం ఎన్టీఆర్‌ను అవమానపర్చడం తగదన్నారు. షర్మిళ కూడా పేరు మార్చడాన్ని వ్యతిరేకించారని గుర్తుచేశారు. అనంతరం డీటీ రమాదేవికి వినతి పత్రం అందించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మణియార్‌ ఖలీల్‌, సహ కార్యదర్శి ఉప్పరి సురేష్‌, మున్సిపల్‌ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాబువలి, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

డోన్‌: హెల్త్‌ యూనివర్సిటీకీ ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్సార్‌ పేరు పెట్టడం తుగ్లక్‌ పాలనకు నిదర్శనమని టీడీపీ డోన్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును మారుస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును నిరసిస్తూ పట్టణంలోని 5వ వార్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర జీవో ప్రతులను దహనం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, డోన్‌ మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణ గౌడు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధి విజయభట్టు, ఆలా మల్లికార్జున రెడ్డి, యువ నాయకుడు ధర్మవరం గౌతమ్‌ రెడ్డి, ఆంజనేయగౌడు, ఎస్‌టీ గుల్షన్‌, గురు రాజుభట్టు, నీలం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

నందికొట్కూరు/నందికొట్కూరు(రూరల్‌): జైలు జీవితం గడిపిన సీఎం జగన్‌ జైలుకు జగన్మోహన్‌రెడ్డి పేరు పెట్టుకోవాలని తెలుగుయువత రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మహే్‌షనాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలంటూ పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. పటేల్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ రాజశేఖర్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ టీడీపీ అధికారప్రతినిధి కాకరవాడ చిన్నవెంకటస్వామి మాట్లాడుతూ సీఎం జగన్‌ నిస్సిగ్గుగా మహనీయుని పేరును మార్చడం దారుణమన్నారు. మిడ్తూరు, నందికొట్కూరు, పాములపాడు, కొత్తపల్లె, మండలాల అఽధ్యక్షులు కాతా రమే్‌షరెడ్డి, ఓబుల్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, జెడ్‌.వెంకటరెడ్డి, మైనార్టీసెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి షకీల్‌ అహ్మద్‌, పట్టణాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి, ఐటీడీపీ అధ్యక్షుడు ముర్తుజావలి, వార్డు ఇన్‌చార్జి వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Read more