‘సెల్‌ఫోన్‌ హాజరు విధానం రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2022-08-17T05:56:30+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సెల్‌ఫోన్‌ ద్వారా హాజరు విధానాన్ని రద్దు చేయాలని ఏపీటీఎప్‌-1938 రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, శిరివెళ్ల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురువయ్య, వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

‘సెల్‌ఫోన్‌ హాజరు విధానం రద్దు చేయాలి’
రాజనగరంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

శిరివెళ్ల, ఆగస్టు 16: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సెల్‌ఫోన్‌ ద్వారా హాజరు విధానాన్ని రద్దు చేయాలని ఏపీటీఎప్‌-1938 రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, శిరివెళ్ల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురువయ్య, వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. రాజనగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో ఏపీటీఎప్‌ నాయకులు, ఉపాధ్యాయులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. హెచ్‌ఎం వరహామయ్య, నాయకులు వెంకటేశ్వర్లు, అబ్దుల్‌ రహీం, ఆంజనేయులు, నూరుల్లా బేగ్‌, తిమ్మా రెడ్డి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మీబాయి, రాధమ్మ పాల్గొన్నారు. 


చాగలమర్రి: పాఠశాలల్లో బోధనకు ఆటంకంగా మారిన యాప్‌ల భారం తగ్గించాలని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌ పెద్దవంగలి ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యాప్‌ల ద్వారా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు శివశంకర్‌, జయరాజు, నరసింహులు, శేషాద్రి, అబ్దుల్‌ఖాదర్‌, నారాయణరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సురేషప్ప పాల్గొన్నారు. 


బనగానపల్లె: మొబైల్‌ అటెండెన్సు యాప్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎప్‌ జిల్లా అధ్యక్షుడు మాధవస్వామి డిమాండ్‌ చేశారు. సోమవారం బనగానపల్లె ఏపీటీఎప్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మొబైల్‌లో ముఖ అధారిత అటెండెన్సును వెంటనే విరమించాలని, ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు మధుసూదన్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులు లింగమయ్య, వై.సుంకన్న, బాలరాజు, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T05:56:30+05:30 IST