తుఫానుతో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-12-13T01:11:49+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్‌ తుపాన్‌ కారణంగా నంద్యాల జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తుఫానుతో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

నంద్యాల టౌన్‌, డిసెంబరు 12: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్‌ తుపాన్‌ కారణంగా నంద్యాల జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాల కారణంగా పాత మిద్దెలు, గోడలు కూలిపోవడం, చెట్లు నేలకొరగడం, విద్యుత్‌ స్తంభాలు, కరెంట్‌ తీగలు తెగిపోవడం వంటివి జరిగే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-12-13T01:11:49+05:30 IST

Read more