బాస్కెట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-16T00:26:30+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని అంతర్‌ డిగ్రీ కళాశాలల బాస్కెట్‌ బాల్‌ పోటీలు గురువారం సిల్వర్‌ జూబ్లీ కళాశాల మైదానంలో ప్రారంభమయ్యాయి.

 బాస్కెట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

కర్నూలు(స్పోర్ట్స్‌), డిసెంబరు 15: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని అంతర్‌ డిగ్రీ కళాశాలల బాస్కెట్‌ బాల్‌ పోటీలు గురువారం సిల్వర్‌ జూబ్లీ కళాశాల మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిల్వర్‌ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.వీవీఎస్‌ కుమార్‌, రాయలసీమ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ డా. శివకిషోర్‌, పోటీల నిర్వాహక కార్యదర్శి డా.వై.కళ్యాణ్‌ కుమార్‌ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ డా.వీవీఎస్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో సమానంగా క్రీడలలో రాణించి నప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఈ పోటీలకు వివిధ డిగ్రీ కళాశాలల పీడీలు పాల్గొన్నారు. అనంతరం విజేతలుగా సుంకేసుల రోడ్డులోని సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కళాశాల జట్టు మొదటి విజేతగా నిలిచింది. రెండో విజేతగా ఉస్మానియా కళాశాల, మూడో విజేతగా కోసిగి నారాయణ డిగ్రీ కాలేజీ, నాలుగో విజేతగా ఆదోని ఆర్ట్స్‌ కాలేజీ జట్లు విజేతలుగా నిలిచాయి.

Updated Date - 2022-12-16T00:26:33+05:30 IST