Baireddy Rajasekhar Reddy: మంత్రి ధర్మానకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి..

ABN , First Publish Date - 2022-12-31T15:06:25+05:30 IST

కర్నూలు: మంత్రి ధర్మాన ప్రసాదరావుకు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Baireddy Rajasekhar Reddy: మంత్రి ధర్మానకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి..

కర్నూలు: మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao)కు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Baireddy Rajasekhar Reddy) డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ ఆనాడు రాయలసీమ వాసుల ప్రాణ త్యాగం వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోగలి గామని.. మంత్రి ధర్మాన గుర్తించుకోవాలన్నారు. అమరావతి (Amaravathi) క్యాపిటల్‌ను షిఫ్ట్ చేస్తే కర్నూలు రాజధానికి మంత్రి ధర్మాన మద్దతు పలకాలన్నారు. నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో అన్యాయం జరిగితే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాల్సిందేనని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-31T15:06:43+05:30 IST