ఆటో బోల్తా.. వ్యవసాయ కూలీ మృతి

ABN , First Publish Date - 2022-03-05T05:51:50+05:30 IST

మండలంలోని మల్లేవేముల గ్రామ సమీపంలో శుక్రవారం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

ఆటో బోల్తా.. వ్యవసాయ కూలీ మృతి

చాగలమర్రి, మార్చి 4: మండలంలోని మల్లేవేముల గ్రామ సమీపంలో శుక్రవారం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆళ్లగడ్డ మండలం బాచేపల్లె గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మౌలాలి (44) మృతి చెందగా మహిళా కూలీ కాసీం బీ తీవ్రంగా గాయపడినట్లు ఎస్‌ఐ రమణయ్య తెలిపారు. బాచేపల్లె గ్రామానికి చెందిన 16 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో కడపజిల్లా గోపాయపల్లె గ్రామానికి కూలీ పనుల నిమిత్తం వెళ్లారు. మల్లేవేముల గ్రామ సమీపానికి చేరుకోగానే మలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడిందని అన్నారు. దీంతో ఆటోలోని వ్యవసాయ కూలీలు మౌలాలి, కాసింబీ గాయపడ్డారని అన్నారు. గాయపడ్డ వీరిని 108లో ఆళ్లగడ్డ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా మౌలాలి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని ఎస్‌ఐ పేర్కొన్నారు. Read more