17న వేలం పాటలు

ABN , First Publish Date - 2022-01-13T05:33:47+05:30 IST

కొలను భారతి పుణ్యక్షేత్రంలో ఏడాది పాటు వివిధ రకాల దుకాణాలు నిర్వహించుకునేందుకు ఈ నెల 17 ఉదయం 10 గంటలకు క్షేత్ర ప్రాంగణంలో వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మోహన తెలిపారు.

17న వేలం పాటలు


కొత్తపల్లి, జనవరి 12: కొలను భారతి పుణ్యక్షేత్రంలో ఏడాది పాటు వివిధ రకాల దుకాణాలు నిర్వహించుకునేందుకు ఈ నెల 17 ఉదయం 10 గంటలకు క్షేత్ర ప్రాంగణంలో వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మోహన తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ దేవస్థానం పరిధిలో హోటళ్ళు, గాజులు, బొమ్మల అంగళ్ళు కూల్‌డ్రింక్స్‌, ఐస్‌, చెరకుగడలు, అమ్మవారి ఫొటోలు విక్రయించుకునేందుకు ఈ వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వసంతపంచమికి 5 రోజుల ముందు నుంచి 2023 వసంత పంచమికి 5 రోజులు ముందు వరకు అంగళ్ళు పెట్టుకునేందుకు వేలంపాటలు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు రూ2000 డిపాజిట్‌ చెల్లించి వేలంలో పాల్గొనాలని అన్నారు.  


Updated Date - 2022-01-13T05:33:47+05:30 IST