పెద్దాసుపత్రిలో వ్యక్తిపై దాడి

ABN , First Publish Date - 2022-12-16T00:27:56+05:30 IST

నర్సింగ్‌ విద్యార్థినుల ఫొటోలు తీశాడంటూ వారి బంధువులు ఆగ్రహించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మోసిన్‌ అనే వ్యక్తిపై దాడి చేశారు.

పెద్దాసుపత్రిలో వ్యక్తిపై దాడి

నర్సింగ్‌ విద్యార్థినుల ఫొటోలు తీశాడంటూ బంధువుల ఆగ్రహం

కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 15: నర్సింగ్‌ విద్యార్థినుల ఫొటోలు తీశాడంటూ వారి బంధువులు ఆగ్రహించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మోసిన్‌ అనే వ్యక్తిపై దాడి చేశారు. బుధవారం ఆసుప త్రిలో నర్సింగ్‌ విద్యార్థినుల ఫొటోలను అనధికార ఉద్యోగి తీశారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ విషయాన్ని ఓ నర్సింగ్‌ విద్యార్థిని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం మధ్యాహ్నం నర్సింగ్‌ విద్యార్థుల బంధువులు, తల్లిదండ్రులు మోసిన్‌పై పిడిగుద్దులతో దాడి చేశారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కర్నూలు మెడికల్‌ కాలేజీ ఏడీ తెలిపారు.

Updated Date - 2022-12-16T00:28:00+05:30 IST