అబ్బురపరిచిన విన్యాసాలు

ABN , First Publish Date - 2022-10-07T05:46:02+05:30 IST

దసరా వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో .. యువకులు తమ విన్యాసాలతో ఆకట్టుకుంటారు.

అబ్బురపరిచిన విన్యాసాలు
గుడికల్‌ గ్రామంలో దసరా సందర్బంగా ఓ యువకుడు వరుసగా పెట్టిన ట్యూబ్‌లైట్లను మోటారుబైక్‌పై వస్తు పగలగోడుతున్న దృశ్యం

గుడికల్‌ గ్రామంలో యువకుల సాహసాలు  


ఎమ్మిగనూరు, అక్టోబరు 6: దసరా వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో .. యువకులు తమ విన్యాసాలతో ఆకట్టుకుంటారు.  ప్రతి ఏడాది ఏదో ఓ కొత్త తరహా సాహస విన్యాసాన్ని నేర్చుకొని దసరా రోజు.. మరుసటి రోజు   ప్రదర్శించి పలువురి చేత ఔరా.. అనిపించుకుంటారు.  మండలంలోని గుడికల్లు గ్రామంలో దసరా ఉత్సవాల సందర్భంగా బుధవారం, గురువారం యువకులు నిర్వహించిన విన్యాసాలు గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  గ్రామంలో ఉన్న చింతమాను వ్యాయామశాల, రామమ్మ గల్డి, గచ్చిని గల్డి యువకులు గ్రామ పెద్దలు రుద్రగౌడు, పురుషోత్తంగౌడుల ఆధ్వర్యంలో విన్యాసాలను ప్రదర్శించారు. ఓ యువకుడు  బండి చక్రానికి కింద రెండు సిలిండర్లు కట్టి పది అడుగుల పైన ఏర్పాటుచేసిన నిచ్చెనపై వీపుకు ఇనుప కొక్కీలు గుచ్చుకని పైకి లాగారు.  మరో యువకుడు  కట్టెల మధ్య ఏర్పాటు చేసిన ట్యూబ్‌లైట్లను మోటారుపై వస్తూ పగులకొట్లాడు.  బండరాళ్లకు తాళ్లు కట్టి వీపుకు గుచ్చుకున్న ఇనుప చువ్వలతో పది అడుగులపైన నిచ్చెన  పైకి లాగారు. కాళ్లకు, చేతులకు తాడుకట్టుకొని మొద్దును పైకి లాగారు. పెద్ద డబ్బాల్లో నిప్పు పెట్టి వాటిపై జంప్‌ చేశారు.  ఇలా  యువకుల  విన్యాసాలు ఒళ్లు గగుర్పాటు కలిగించింది.  




Updated Date - 2022-10-07T05:46:02+05:30 IST