-
-
Home » Andhra Pradesh » Kurnool » Alluru TDP leaders who met Lokesh-MRGS-AndhraPradesh
-
లోకేష్‌ను కలిసిన ఆలూరు టీడీపీ నాయకులు
ABN , First Publish Date - 2022-03-06T05:27:52+05:30 IST
టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జునచౌదరి, మాజీ ఎమ్మెల్సీ డా.మసాల పద్మజ, మాజీ జడ్పీటీసీ దేవేంద్రప్పలు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆలూరు, మార్చి 5: టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జునచౌదరి, మాజీ ఎమ్మెల్సీ డా.మసాల పద్మజ, మాజీ జడ్పీటీసీ దేవేంద్రప్పలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలూరు నియోజకవర్గ సమస్యలు, పార్టీ స్థితిగతులపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని నారా లోకేష్ సూచించినట్లు తెలిపారు. వారి వెంట టీడీపీ నాయకులు శైలేందర్, అనిల్, జహీర్, ఎల్లంకి నారాయణస్వామి చౌదరి, అమర్ పాల్గొన్నారు.