‘నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు’
ABN , First Publish Date - 2022-03-03T05:46:29+05:30 IST
చిన్నారుల్లో నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వాడాలని జేసీ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు.
కర్నూలు(హాస్పిటల్), మార్చి 2: చిన్నారుల్లో నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వాడాలని జేసీ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా బుధవారం నగరంలోని బి.క్యాంపు ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో జేసీ మధ్యాహ్నం భోజనం అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. జేసీ మాట్లాడుతూ నులిపురుగులు ఉండటం పిల్లలకు కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయని అన్నారు. ఆర్బీఎస్కే జిల్లా కో ఆర్డినేటర్ డా. శైలేష్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.వై.ప్రవీణ్‌కుమార్, పీఓడీటీటీ డా.ఓ. ప్రభావతి, హెల్త్‌ఎడ్యుకేటర్ మల్లికార్జున పాల్గొన్నారు.