డాక్టర్‌ నిర్లక్ష్యంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-10-18T05:49:49+05:30 IST

డాక్టరు నిర్లక్ష్యం వల్ల వెల్దుర్తి గ్రామానికి చెందిన 17 ఏళ్ల హర్షవర్థన్‌ నాయుడు మృతి చెందాడని, తక్షణమే ఓమ్ని హాస్పిటల్‌ను సీజ్‌ చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

డాక్టర్‌ నిర్లక్ష్యంతో యువకుడి మృతి

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన

కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 17:
డాక్టరు నిర్లక్ష్యం వల్ల వెల్దుర్తి గ్రామానికి చెందిన 17 ఏళ్ల హర్షవర్థన్‌ నాయుడు మృతి చెందాడని, తక్షణమే ఓమ్ని హాస్పిటల్‌ను సీజ్‌ చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన వెల్దుర్తికి చెందిన హర్షవర్ధ్దన్‌ నాయుడు అనే యువకుడు అనారోగ్యంతో ఓమ్ని హాస్పిటల్‌కు వెళ్లగా.. గుండెలో రంధ్రాలు మూసుకుపోయాయని, బైపాస్‌ సర్జరీ అవసరమవుతుందని, ఆరోగ్యశ్రీ కింద చేర్చు కున్నారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే నిధులు సరిపోవని మెడిసి న్‌, స్కానింగ్‌ పేరుతో తల్లిదండ్రుల నుండి రూ. లక్ష వరకు బిల్లులు వసూలు చేశారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ అప్రూవల్‌ అయినప్పటికీ లక్ష రూపాయలు వసూలు చేయడమే కాకుండా సర్జరీ తర్వాత డిశ్చార్జ్‌ చేసి ఇంటికి పంపించిన తర్వాత ఏం జరిగినా తమకు సంబందం లేదని డాక్టర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంటికి వెళ్లిన నాలుగోరోజుకే సర్జరీ చేసిన శరీర భాగాల్లో బ్లీడింగ్‌ అవుతుందని చెప్పినా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. హాస్పిటల్‌కు తీసుకువచ్చిన గంటలోపే రోగి చనిపోయాడని, హాస్పిటల్‌ యజమాన్యం, డాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల రోగి మృతి చెందాడని అన్నారు. మృతి చెందిన రోగి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి హాస్పిటల్‌ను సీజ్‌ చేసి డాక్టరును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు, సీపీఐ నగర సహాయ కార్యదర్శులు మహేష్‌, శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు వెంకటేష్‌, రామాంజినేయులు, రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read more