ప్రజా కోర్టులో గుణపాఠం తప్పదు
ABN , First Publish Date - 2022-12-15T23:38:07+05:30 IST
ప్రజా కోర్టులో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని పాణ్యం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత
కల్లూరు, డిసెంబరు 15: ప్రజా కోర్టులో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని పాణ్యం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. గురువారం కల్లూరు అర్బన్ 37వ వార్డులోని వీకర్‌సెక్షన్ కాలనీలో చేపట్టిన ఇదేమి ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మూడున్నరేళ్ళకు పైగా వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. వార్డు ఇన్‌చార్జ్ కృష్ణవేణమ్మ, టీడీపీ నాయకులు జనార్థన్ ఆచారి, గంగాధర్‌గౌడు, కాసాని.మహేష్‌గౌడు, నాగేశ్వరరావు, రాముడు, మధు, శివతేజ పాల్గొన్నారు.
కర్నూలు(న్యూసిటీ): మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తోందని కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్, 38, 39, 40 వార్డుల టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి వై. రామేశ్వరరెడ్డి అన్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గురువారం 38వ వార్డు మామిదాలపాడులో ఇంటింటికి వెళ్లి వైసీపీ అసమర్ధత పాలనపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అందక, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఈ.మహేశ్వరరెడ్డి, వెంకటేష్, సయ్యద్‌బాషా, ఈ.ఈశ్వరరావు, ఈ.గంగాధర్, సుంకులమ్మ, సురేంద్రగౌడు, ప్రసాద్ పాల్గొన్నారు.
నంద్యాల (నూనెపల్లె): రాష్ట్రంలో వైసీపీ పాలనకు అన్నివర్గాల ప్రజలు విసిగిపోయారని, వైసీపీ పాలనను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని గురువారం జిల్లా కేంద్రంలోని 12వ వార్డు బాలాజీ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వార్డులో ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ మూడున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఆరాచకాలు, గుండాయిజం, కబ్జాలు, దందాలు తప్పితే వైసీపీ పాలన సాధించేమి లేదని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, రైతులను మోసం చేసిందని, ఎన్నికల ముందు వారికిచ్చిన హామీలను నెరవేర్చకుండా వైసీపీ పైశాచిక ఆనందం పొందుతోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేర్లతో కొంతమంది లబ్ధిదారులకే నగదు బదిలీలు చేసి, అర్హులైన వారిని విస్మరించారని, రూ.వేల కోట్లు అప్పులు తీసుకువచ్చి సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చారని దుయ్యబట్టారు. వైసీపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి భారీ మెజార్టీతో అధికారాన్ని ప్రజలు కట్టబెడతారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఖలీల్, వార్డు ఇన్‌చార్జి శేఖర్, మనోహర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, గోవిందనాయుడు, భాస్కర్‌రెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.