13 మందికి అస్వస్థత

ABN , First Publish Date - 2022-08-05T05:17:24+05:30 IST

మండలంలోని తుమ్మలూరు గ్రామంలో రెండు రోజులుగా డయేరియా కేసులు నమోదు అవుతుండటంతో గురువారం నంద్యాల జిల్లా డీఎంహెచ్‌వో వెంకటరమణ, పాములపాడు మండల వైద్యాధికారి నాగలక్ష్మి గ్రామాన్ని సందర్శించారు.

13 మందికి అస్వస్థత

గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో

పాములపాడు ఆగష్టు 4 : మండలంలోని తుమ్మలూరు గ్రామంలో రెండు రోజులుగా డయేరియా కేసులు నమోదు అవుతుండటంతో గురువారం నంద్యాల జిల్లా డీఎంహెచ్‌వో వెంకటరమణ, పాములపాడు మండల వైద్యాధికారి నాగలక్ష్మి గ్రామాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం నలుగురికి, గురువారం ఐదుగురికి వాంతులు విరేచనాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని తెలిపారు. స్థానిక ఆస్పత్రిలో ఐదుగురు చికిత్స పొందుతున్నారన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నీరు కలుషితమై ఉండవచ్చు అని ఆమె అన్నారు. నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. ఐదుగురు కోలుకున్నారని తెలిపారు. గ్రామంలో మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. బాధితులను ఎంఎల్‌ఎ తోగూరు ఆర్థర్‌ పరామర్శించారు.

Updated Date - 2022-08-05T05:17:24+05:30 IST