యువతకు అండగా యువగళం

ABN , First Publish Date - 2022-12-31T00:44:03+05:30 IST

యువతకు అండ గా టీడీపీ యువ నాయకుడు లోకేశ్‌ చేపడుతున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జును డు అన్నారు.

యువతకు అండగా యువగళం
పోరంకి టీడీపీ కార్యాలయంలో లోకేష్‌ పాదయాత్ర పోస్టర్‌ ఆవిష్కరణ

గన్నవరం, డిసెంబరు 30 : యువతకు అండ గా టీడీపీ యువ నాయకుడు లోకేశ్‌ చేపడుతున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జును డు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్ర వారం విలేకరులతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ విధానాలతో అందరూ ఇబ్బందులకు గురవుతు న్నారని తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, టౌన్‌ అధ్యక్షుడు జాస్తి శ్రీధర్‌రావు, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు బోయ పాటి రమాదేవి, నాగవరప్రసాద్‌, మండవ అన్వేష్‌, చిక్కవరపు నాగమణి, సత్యనారాయణ, చీమల దండు రామకృష్ణ, షేక్‌ అబుల్యాజ్‌, ఆరుమళ్ల కృష్ణారెడ్డి, దేవినేని సులో చన, సరితాదేవి, సూర్యప్రకాష్‌, శ్రీను, రఘు, సుభాష్‌చంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు.

పెనమలూరు : యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకే నారా లోకేశ్‌ పాదయాత్రకు ఉపక్రమించారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో లోకేష్‌ పాదయాత్ర పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెలగపూడి శంకరబాబు, అనుమోలు ప్రభాకరరావు, దొంతగాని పుల్లేశ్వరరావు, పీతా గోపి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు మూడున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఉత్తిత్తి జాబ్‌క్యాలెండరుతో యువత గొంతు కోశాడని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్‌ బుజ్జి, కోయ ఆనందప్రసాద్‌, బొమ్మి డి అన్నపూర్ణ, షేక్‌ మాబుసుబాని, అబూ సలేం, సయ్య ద్‌ ఇబ్రహీం, ఉప్పలపాటి ప్రవీణ్‌, శొంఠి శివరాంప్రసాద్‌, ముసునూరి శ్రీధర్‌ పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ : వైసీపీ పాలనలో యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహించనున్న మహా పాదయాత్రను జయప్రదం చేయాలని టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యువ గళం కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు పుట్టా సురేష్‌, వేములపల్లి శ్రీని వాసరావు, గుండపనేని ఉమావర ప్రసాద్‌, మూల్పూరి సాయికల్యాణి, మజ్జిగ నాగరాజు, మండాది రవీంద్ర, చలసాని శ్రీనివాసరావు, కొండపల్లి వెంకటేశ్వరరావు, కాండ్రు అజయ్‌, అక్కినేని రవి, ఎదురువాడ కిరణ్‌, అచ్చన వెంక టేశ్వరరావు, కంచనపల్లి రామారావు, కత్తుల జాన్స్‌న్‌, మాణిక్యాలరావు పాల్గొన్నారు.

గుణదల : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టనున్న యువగళం పాద యాత్రను విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా యువత పెద్దఎత్తున ముందుకు వస్తున్నారని టీడీపీ విజయవాడ రూరల్‌ మండల ప్రధాన కార్యదర్శి కోనేరు సందీప్‌ తెలిపారు. ప్రసాదంపాడులో నిర్వ హించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిం చారు. ప్రసాదంపాడు ఉప సర్పంచ్‌ గూడవల్లి నరస య్య మాట్లాడుతూ, లోకేష్‌కు అండగా నిలిచేం దుకు ఇప్పటికే యువత పెద్ద ఎత్తున పేర్లు నమోదు చేసు కుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయ కులు పరుచూరి నరేష్‌, దండు సుబ్రహ్మణ్యం రాజు, బొప్పన హరికృష్ణ, నబిగాని కొండ, అడుసు మిల్లి నవీన్‌, గుజ్జర్లపూడి బాబూరావు, కానూరు యుగంధర్‌, పోక కిరణ్‌ కుమార్‌, బొమ్మసాని అరుణ, పరిటాల జోగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:44:03+05:30 IST

Read more