ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించేందుకే యువగళం

ABN , First Publish Date - 2022-12-31T00:37:54+05:30 IST

ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రశ్నించేందుకు నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర చేపడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించేందుకే యువగళం
కొండపల్లిలో యువగళం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దేవినేని ఉమా, తదితరులు

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 30 : ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రశ్నించేందుకు నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర చేపడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పాదయాత్ర విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్‌ను శుక్రవారం కొండపల్లి రైల్వే స్టేషన్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. లోకేష్‌ 400రోజులు పాటు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నారని తెలిపారు. ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే తుంగలో తొక్కాడని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోమటి సుధాకర్‌, జంపాల సీతారామయ్య, కౌన్సిలర్లు చెన్నుబోయిన చిట్టిబాబు, చుట్టుకుదురు శ్రీనివాసరావు, కరిమికొండ శ్రీలక్ష్మి, చుట్టుకుదురు వాసు, చనమోలు నారాయణరావు, మైలా సైదులు, రావి ఫణీ, డాక్టర్‌ గంగా మధుసూదనరావు, పర్వతనేని సాంబశివరావు, యొండ్లూరు గోపి, సుంకర విష్ణుకుమార్‌, కూచిపూడి దిలీప్‌కుమార్‌, గౌరా శ్రీనివాసరావు, చెన్నుబోయిన శివ యాదవ్‌ పాల్గొన్నారు.

జి.కొండూరు : ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లాయని దేవినేని ఉమా అన్నారు. గుర్రాజుపాలెంలో నారా లోకేశ్‌ యువగళం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, పజ్లూరు రవి కుమార్‌, లంక రామకృష్ణ వరప్రసాద్‌, మురళీ మదన్‌ మోహన్‌, నంబూరి శ్యామ్‌, దొండపాటి విజయ్‌, అంకెం సురేష్‌, వరికూటి శ్రీనివాసరావు, వరికుతీ రాము, సుఖవాసీ శ్రీహరి, మనం వెంకటరావు, ఆర్‌.శివయ్య పాల్గొన్నారు.

మైలవరం : శుక్రవారం పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో పాదయాత్రకు సంబంధించిన యువగళం పోస్టర్‌ను స్థానిక నాయకులతో కలసి దేవినేని ఉమాఆవిష్కరించారు. కార్యక్రమంలో నేతలు తాతా పోతురాజు, గంజి రామకృష్ణారెడ్డి, మల్లెల రాధాకృష్ణ, దూరు బాలకృష్ణ, లంక లితీష్‌, మద్దినేని శ్రీను, చారుగుండ్ల ప్రసాద్‌, షహనబేగం, ఖాజా, జానీ,బాబురావు పాల్గొన్నారు.

నందిగామ : తుగ్లక్‌ పాలనకు చరమగీతం పాడేందుకు యువనేత నారా లోకేశ్‌ యువగళం పేరతో పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. గాంధీ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2022-12-31T00:37:54+05:30 IST

Read more