రైతులకు శాపంగా వైసీపీ పాలన
ABN , First Publish Date - 2022-12-16T01:39:00+05:30 IST
వైసీపీ పాలన రైతులకు శాపంగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
కూనపరాజుపర్వ(రెడ్డిగూడెం) : వైసీపీ పాలన రైతులకు శాపంగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కూనపరాజుపర్వలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లో ఉండిపోయి తడిసి మొల కెత్తిందన్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని ఆయన పరిశీ లించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నేతలు కె.విజయబాబు, ముప్పిడి నాగేశ్వరరెడ్డి, రాయుడు వెంకటేశ్వరరావు, పైడిమర్ల కిరణ్‌కుమార్‌రెడ్డి, జానాలపాటి వేణుగోపా ల్‌రెడ్డి, తన్నీరు మల్లికార్జునరావు పాల్గొన్నారు.
తుమ్మలపాలెం(ఇబ్రహీంపట్నం) : వైసీపీ ప్రభుత్వ అసమర్థత పాలన కారణంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా లేరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శిం చారు. తుమ్మలపాలెంలో గురువారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. 14అంశాలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు అందించి వివరాలు నమోదు చేశారు. రైతులు, రైతు కూలీలు, భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని ఉమా అన్నారు. నదిలో నాసిరకం చేపలు వేసి మత్స్యకారులను ఎమ్మెల్యే వసంత మభ్యపెట్టారని విమర్శించారు. టీడీపీ సీనియర్ నాయకుడు జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్, చుట్టుకుదురు శ్రీనివాసరావు, కరిమికొండ శ్రీలక్ష్మీ, వల్లూరు జమాయి దేవకుమారి, చెన్ను బోయిన చిట్టిబాబు, చనమోలు నారాయణ రావు, సుంకర విష్ణుకుమార్, తాడికొండ రామకృష్ణ, కూచిపూడి దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.