-
-
Home » Andhra Pradesh » Krishna » YCP physical attacks on questioning Pratiks-NGTS-AndhraPradesh
-
ప్రశ్నిస్తున్న ప్రతిక్షాలపై వైసీపీ భౌతికదాడులు
ABN , First Publish Date - 2022-09-08T06:16:29+05:30 IST
సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్న నీచసంస్కృతి వైసీపీ ప్రభుత్వానిదని టీడీపీ బీసీసెల్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కందిమళ్ల శేషగిరిరావు విమర్శించారు.

టీడీపీ నిరసన
తిరువూరు, సెప్టెంబరు 7: సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్న నీచసంస్కృతి వైసీపీ ప్రభుత్వానిదని టీడీపీ బీసీసెల్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కందిమళ్ల శేషగిరిరావు విమర్శించారు. విజయవాడలో చెన్నుపాటి గాంధీపై వైసీపీ నాయకుల దాడిని బుధవారం ఖండిస్తూ పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యోగులు సైతం తమ సమస్యలపై ప్రశ్నించే హక్కులేకుండా హరిస్తున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని పాలకులు ప్రతిపక్షాలను అణగదొక్కే కుట్రకు పూనుకుంటుందన్నారు. చెన్నుపాటి గాంధీపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీసీ సెల్ అధ్యక్షుడు పర్వతం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పంది శ్రీనివాసరావు, వాకదాని లక్ష్మీనారాయణ, మార్కండేశ్వరరావు, సోమవరపు శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు చెడుగొండి సరస్వతి, చెడుగొండి శ్రీనివాసరావు, మాధవచారి, ఇమ్మడి రవి పాల్గొన్నారు.