వైసీపీ పాలనలో పేదలకు నరకం

ABN , First Publish Date - 2022-12-15T01:28:30+05:30 IST

రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలన వల్ల పేద ప్రజల జీవితాలు తల్లక్రిందులయ్యాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 28వ డివిజన్‌ బీఆర్టీఎస్‌రోడ్డు భానునగర్‌ సెంటర్‌ నుంచి బుధవారం ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి , మన సెంట్రల్‌ నియోజకవర్గానికి, మన భానునగర్‌కు కార్యక్రమం నిర్వహించారు.

 వైసీపీ పాలనలో పేదలకు నరకం
సమస్యలు తెలుసుకుంటున్న బొండా ఉమా, కార్పొరేటర్‌ వీరమాచినేని లలిత

సత్యనారాయణపురం, డిసెంబరు 14: రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలన వల్ల పేద ప్రజల జీవితాలు తల్లక్రిందులయ్యాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 28వ డివిజన్‌ బీఆర్టీఎస్‌రోడ్డు భానునగర్‌ సెంటర్‌ నుంచి బుధవారం ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి , మన సెంట్రల్‌ నియోజకవర్గానికి, మన భానునగర్‌కు కార్యక్రమం నిర్వహించారు. ఉమా ఇంటింటికి తిరిగి జగన్‌రెడ్డి అసమర్థపాలన గురించి , పెరిగిన ధరల గురించి వివరించారు. ఈ సందర్బంగా ఆయ న మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతూ దుర్మార్గపు పాలన సాగిస్తుందన్నారు. ఉప్పు, పప్పు నిత్యావరసర ధరలు అన్ని ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. వైసీపీ నేత లు ఇంటింటికి వెళుతుంటే ఎదురు తిరుగుతున్న ప్రజలు టీడీపీ నేలు వస్తుంటే బ్రహ్మరఽథం పడుతున్నారని ఉమా అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ వీరమాచినేని లలి త, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, డివిజన్‌ అధ్యక్షుడు జి. శ్రీను, పవన్‌ పాల్గొన్నారు.

ఘనంగా సెమిక్రీస్మస్‌

పాయకాపురం : ఉడా కాలనీలోని చర్చిలో బుధ వారం సెమీక్రిస్మస్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోకంపై క్రీస్తు చూపిన ప్రేమను ప్రజలకు వివరించారు. అనంతరం దుస్తులు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లబ్బా దుర్గ, బత్తుల కొండ, కోలా శ్రీను, లబ్బా వైకుంఠం, పట్టిమ రమణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:28:33+05:30 IST