యంత్ర పరికరాలపై సబ్సిడీ ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-10T06:14:57+05:30 IST

యంత్ర పరికరాలపై సబ్సిడీ ఇవ్వాలి

యంత్ర పరికరాలపై సబ్సిడీ ఇవ్వాలి

 విజయవాడ రూరల్‌ వ్యవసాయ సలహా మండలి 

 విజయవాడ రూరల్‌, సెప్టెంబరు 9 : రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలను  సబ్సిడీపై ఇవ్వాలని, ఇందుకు అధికారులు చర్యలు చేపట్టాలని  మండల వ్యవసాయ సలహా మండలి సమావేశంలో కోరారు.  సలహా మండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి అధ్యక్షతన నున్నలోని రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ అంశాన్ని ప్రస్తావించారు. ఈ విషయాలను తాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఏవో బత్తిన రంగనాథబాబు తెలిపారు. అనంతరం సలహా మండలి చైర్మన్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాలతోపాటు గోదాముల నిర్మాణం పూర్తయిన వెంటనే రైతులకు వ్యక్తిగతంగా సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు కె సువర్ణరాజు, వెటర్నరీ డాక్టర్‌ ప్రసన్న, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పోలారెడ్డి చంద్రారెడ్డి, డైరెక్టర్‌ భీమవరపు ముత్తారెడ్డి, నున్న ఉప సర్పంచ్‌ కలకోటి బ్రహ్మానందరెడ్డి, మండలి సభ్యులు సాంబశివరావు, పోలారెడ్డి రమేష్‌రెడ్డి, వీఏఏలు మౌనిక, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.  

Read more