పాడిరైతుల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2022-08-04T06:27:25+05:30 IST

కరోనా సమయంలోనూ కృష్ణామిల్క్‌ యూనియన్‌ పాడి రైతులకు లీటరు పాలధర అధికంగా ఇవ్వడంతో పాటు ప్రతినాలుగు నెలలకు బోనస్‌

పాడిరైతుల సంక్షేమానికి కృషి
సదస్సులో మాట్లాడుతున్న చలసాని

 కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు

లక్ష్మీపురం(తిరువూరు), ఆగస్టు 3: కరోనా సమయంలోనూ కృష్ణామిల్క్‌ యూనియన్‌ పాడి రైతులకు లీటరు పాలధర అధికంగా ఇవ్వడంతో పాటు ప్రతినాలుగు నెలలకు బోనస్‌ ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తుందని కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు.  లక్ష్మీపురం పాలకేంద్రం సమావేశ మందిరంలో బుధవారం పాలసహకార సంఘాల సభ్యులకు రూ. రెండు  కోట్లు  బోనస్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ, పాడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు కల్యాణమస్తు, క్షీరబంధు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పాడిపశువులకు అవసరమైన గ్రాసం, ఇతర దాణాలు సబ్సిడీపై అందించడంతో పాటుగా వైద్య సేవలకు వైద్యులను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. పాలకేంద్రం మేనేజర్‌ సాంబమూర్తి అధ్యక్షతన జరిగిన సదస్సులో విజయమిల్క్‌ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, జిల్లా సభ్యులు బొట్టు రామచంద్రారావు, బోయపాటి సుశీల, జీఎం అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-04T06:27:25+05:30 IST