శ్రీనివాస రామానుజన్‌ స్ఫూర్తితో.. గణితంలో పట్టు సాధించాలి

ABN , First Publish Date - 2022-12-22T00:41:21+05:30 IST

ప్రతీ విద్యార్థి శ్రీనివాస రామానుజన్‌ను స్ఫూర్తిగా తీసుకుని గణితంలో పట్టు సాధించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ దిల్లీరావు అన్నారు.

శ్రీనివాస రామానుజన్‌ స్ఫూర్తితో.. గణితంలో పట్టు సాధించాలి
శ్రీనివాస రామానుజన్‌ స్ఫూర్తితో.. గణితంలో పట్టు సాధించాలి

వన్‌టౌన్‌, డిసెంబరు 21 : ప్రతీ విద్యార్థి శ్రీనివాస రామానుజన్‌ను స్ఫూర్తిగా తీసుకుని గణితంలో పట్టు సాధించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ దిల్లీరావు అన్నారు. 22వ తేదీ ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ జయంతి పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని కాకరపర్తి భావనారాయణ కళాశాలలో మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే మాతోఫిలియా-2022ను బుధవారం కలెక్టర్‌, సమాచార హక్కు చట్టం కమిషనర్‌ యు.హరిప్రసాద్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాత గణిత మేథావుల్లో ఒకరైన దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ అయ్యంగార్‌ చిన్న వయస్సులోనే గణితంపై ప్రతిభ కనబరిచే వారని గుర్తుచేశారు. ప్రతీ విద్యార్థి రామానుజన్‌ స్పూర్తిగా కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్‌ యు.హరిప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు గణితాన్ని చూసి భయపడకూడదని, ఫార్ములాలపై పట్టు సాఽధిస్తే కష్టతరమైన లెక్క అయినా సులువుగా చేయగలమన్నారు. తొలుత గణితంపై విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో ఏరియా ఆఫ్‌ సర్కిల్‌ టైప్స్‌ ఆఫ్‌ ఏంజెల్స్‌ పైథాగరస్‌ ఆల్‌ జిబ్రా, ఎనలాసిస్‌, అర్థమెటిక్‌, గేమ్‌ థీయరి, నెంబర్‌ థీయరి, న్యూమరికల్‌ అనాలిసిస్‌, అష్టిమై జేషన్‌ స్టాటిస్టిక్స్‌ ట్రో ఫాలజీ వంటి బేసిక్స్‌ పై అవగాహన కల్పించే మ్యాథ్స్‌ ఎక్స్‌పోను ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల కమిటీ అధ్యక్షుడు పి.శేషయ్య, ప్రిన్సిపల్‌ వి.నారాయణరావు, మ్యాథ్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ఎం.లక్ష్మిప్రసన్న, కరస్పాండెట్‌ ఎ.రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-22T00:41:28+05:30 IST