మినుము విత్తనాలు ఎప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2022-12-17T00:53:13+05:30 IST

మాండస్‌ తుఫాను కారణంగా అవనిగడ్డ నియోజక వర్గంలో వేలాది ఎకరాల్లో చల్లిన మినుము విత్తనాలు పూర్తిగా కుళ్లి పోయాయని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 80 శాతం సబ్సిడీతో విత్త నాలు సరఫరా చేస్తామని ప్రకటించినా, ఇంతవరకు దానిని ప్రారంభిం చలేదని, పదును ఆరిపోతోందని, ఇంకెప్పుడు ఇస్తారని టీడీపీ మండల నాయకులు ప్రశ్నించారు. శుక్రవారం అవనిగడ్డలో పార్టీ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, నేతలు మాట్లాడారు.

మినుము విత్తనాలు ఎప్పుడిస్తారు?
మాట్లాడుతున్న టీడీపీ నేతలు

అవనిగడ్డ టౌన్‌: మాండస్‌ తుఫాను కారణంగా అవనిగడ్డ నియోజక వర్గంలో వేలాది ఎకరాల్లో చల్లిన మినుము విత్తనాలు పూర్తిగా కుళ్లి పోయాయని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 80 శాతం సబ్సిడీతో విత్త నాలు సరఫరా చేస్తామని ప్రకటించినా, ఇంతవరకు దానిని ప్రారంభిం చలేదని, పదును ఆరిపోతోందని, ఇంకెప్పుడు ఇస్తారని టీడీపీ మండల నాయకులు ప్రశ్నించారు. శుక్రవారం అవనిగడ్డలో పార్టీ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, నేతలు మాట్లాడారు. తుఫానుకు ముందు నియోజకవర్గంలో 70 శాతం రైతులు మినుము విత్తనాలు చల్లుకున్నారని, వర్షాల కారణంగా అవి కుళ్లిపోయాయని తెలి పారు. నేలలో పదును ఉన్నందున ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను ఇప్పుడే పంపిణీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వందలాది ఎకరాల్లో పంట పనలపై ఉందన్నారు. నియోజక వర్గంలో జిల్లా కలెక్టర్‌, అధికారులు పర్యటించి వెంటనే అంచనాలు తయారు చేయమని, డ్రెయిన్లలో అడ్డంకులు తొలగించాలని ఆదేశించార న్నారు. పంట నష్టం అంచనాలు ఏ ఒక్క మండలంలోనూ పూర్తి కాలేద న్నారు. నియోజకవర్గంలో మురుగు పారుదల సక్రమంగా జరగని డ్రైన్లను మరమ్మతులు చేసేందుకు అధికారులకు ఉన్న ఇబ్బంది ఏంటని కొల్లూరి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. మురుగు కాలువల్లో పూడిక తొలగించక పోవడం ఎమ్మెల్యే వైఫల్యమన్నారు. బచ్చు రఘునాథ్‌, రేపల్లె మాధవ రావు, దాసినేని శ్రీనివాసరావు, పండ్రాజు రత్తయ్య, దోవారి ప్రసాద్‌, మేడి కొండ అనిల్‌, పులిగడ్డ నాంచారయ్య, పరిమిశెట్టి శేఖర్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-17T00:53:14+05:30 IST