యువగళం విజయవంతం చేస్తాం

ABN , First Publish Date - 2022-12-31T01:16:50+05:30 IST

యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తెలి పారు.

యువగళం విజయవంతం చేస్తాం
మాట్లాడుతున్న బొండా ఉమా

పాయకాపురం, డిసెంబరు 30: యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మొగల్రాజపురంలోని తన నివాసంలో శుక్రవారం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాక, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వందకుపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరిపించి యువ తకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే 3.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఏటా జనవరి మొదటివారంలో నోటిఫికేషన్‌ ఇస్తామని ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నెరవేర్చలేదన్నారు. కొవిడ్‌ సమయంలో ప్రభుత్వం మొండిగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామంటే వాటిని రద్దు చేయించిన ఘనత లోకేష్‌కే దక్కుతుందన్నారు. ‘యువగళం’ జనవరి 27న కుప్పంలో ప్రారంభమై 400 రోజులు పాటు 4 వేల కిలోమీటర్లు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా యువతకు లోకేష్‌ అండగా నిలబడుతూ అనేక కార్యక్రమాలు చేస్తు న్నారని ఉమా అన్నారు. టీడీపీ నాగవంశం సాధి కార రాష్ట్ర కన్వీనర్‌ ఎరుబోతు రమణారావు, టీఎన్‌ టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్‌, ఘంటా కృష్ణమోహన్‌, గరిమెళ్ల చిన్నా, మురళీ కృష్ణంరాజు, గొట్టుముక్కల వెంకీ తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రను అడ్డుకోవడం నీ తరం కాదు

మంత్రి మేరుగ నాగార్జునకు టీడీపీ నేత కొట్టేటి హనుమంతరావు హెచ్చరిక

విద్యాధరపురం: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోవడం నీతరం కాదంటూ మంత్రి నాగార్జునకు టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు హెచ్చరించారు. మొగల్రాజపురంలోని కేశినేని శివనాథ్‌(చిన్ని) కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిం దన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతగాక, పరిపాలన చేతగాక లోకేష్‌ పాదయాత్రను అడ్డుకుంటామంటూ నాగార్జున ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ‘గడప గడపకు’లో ఎదురవుతున్న పరాభవాలను చూసైనా సిగ్గు తెచ్చుకోవాలన్నారు. దోమకొండ రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:16:51+05:30 IST