నగరాభివృద్ధికి అకింతభావంతో పనిచేస్తున్నాం

ABN , First Publish Date - 2022-12-31T01:14:06+05:30 IST

నగరాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంకితభావంతో పని చేస్తున్నామని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు.

నగరాభివృద్ధికి అకింతభావంతో పనిచేస్తున్నాం
మాట్లాడుతున్న మేయర్‌ భాగ్యలక్ష్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

2022లో నగరాభివృద్ధిపై మేయర్‌ భాగ్యలక్ష్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

చిట్టినగర్‌, డిసెంబరు 30: నగరాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంకితభావంతో పని చేస్తున్నామని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. శుక్రవారం నగపాలకసంస్థ కౌన్సిల్‌ హాలులో 2022లో నగరాభివృద్ధిపై మీడియాతో వారు మాట్లాడారు. 225 క్లాప్‌ వాహనాలతో ఇం టింటికీ చెత్త సేకరిస్తున్నారని తెలిపారు. నగరం నుంచి సేకరించిన ఘన వ్యర్థాలను శుద్ధి చేయడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుందని వారు తెలిపారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధ ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నా మన్నారు. నగరంలో ప్లాస్టిక్‌ పూర్తి నిషే ధాన్ని అమలు చేసేందుకు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటు న్నామన్నారు. ప్రజలకు స్వచ్చసర్వేక్షణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిచండంతోపాటు పలు పోటీలు నిర్వహిస్తు న్నామని, ఇంటింటికి వెళ్లి కంపోస్టింగ్‌పై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొ న్నారు. సెప్టెంబరులో నిర్వహించిన ఇండియన్‌ స్వచ్ఛతా లీగ్‌లో భాగంగా నగరం అంతటా స్వచ్ఛత, పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేశామన్నారు.

నగరాభివృద్ధిపై మేయర్‌, కమిషనర్‌ వివరణ

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో భాగంగా నగరాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరించి ప్రపంచస్థాయికి తీసుకెళ్లాం. ఫ్లై ఓవర్లు, గార్డెన్‌లు వినూత్నంగా తీర్చిదిద్దటంతోపాటు ప్రజలు రోడ్లపై నడిచేటప్పుడు సచ్ఛ మైన గాలిని అందించేలా చర్యలు తీసుకున్నాం. 2021-22 సంవత్సరం రూ.100 కోట్ల నిధులతో నగరాన్ని వాయు కాలుష్య రహిత, ఆరోగ్యకరమైన నివాస్థలంగా మార్చడంతో వీఎంసీ ఉన్నతస్థాయికి చేరింది.

మిషన్‌ క్లీన్‌ కృష్ణా ప్రచారాన్ని నగరపాలక సంస్థ సమర్థవంతంగా నిర్వహించింది. కాల్వగట్లను ప్రజలకు పర్యావరణ అనుకూల ప్రదేశాలుగా మార్చడానికి కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేసింది.

నగరంలో పౌర అవసరాలకు అనుగుణంగా వీఎంసీ సాధారణ నిధులతో పాటు 14వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్లు నిర్మించాం. రోడ్లకు మరమ్మతులు చేశాం. వీధి దీపాల మరమ్మతులకు 64 డివిజన్లలో రూ.9.78 లక్షలు ఖర్చు చేశాం.

కొవిడ్‌- 19 నుంచి రక్షణకు వీఎంసీ ప్రజారోగ్య శాఖ పలు సేవలు అందించింది. పౌరులందరికీ బూస్టర్‌ డోస్‌లతో టీకాలు వేసింది. నగర జనాభాలో అధికశాతం మందికి బూస్టర్‌ టీకాలు వేశాం. 6 నూతన పట్టణ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు నిర్మించాం.

పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ నిషేధం, స్వచ్చ సర్వేక్షణ్‌, ఈజ్‌ ఆప్‌ లివింగ్‌, దేశభక్తిపై గోడ పెయింటింగ్‌ల ద్వారా సమాజానికి అవగాహన కల్పిస్తున్నాం. కోట్లాది రూపాయలతో రాజీవ్‌గాంధీపార్కును అన్ని హంగులతో అభివృద్ది చేశాం. ఆహ్లాదాన్ని అందించేలా తీర్చిదిద్దాం.

రూ.37.25 కోట్లతో 16 కిలోమీటర్ల సీసీరోడ్లు, 18 కిలోమీటర్ల తారురోడ్లు, రూ.13.88 కోట్లతో షాదీఖానా, 2.46లక్షలతో విద్యాధరపురం, సింగ్‌నగర్‌ శ్మశానవాటికలను నిర్మించాం. రూ.84 లక్షలతో 16 శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది.

రూ.1.5కోట్లతో రోడ్లు శుభ్రం చేసే యంత్రాలు 3, రూ.1.2 కోట్లతో 4 డీ-సిల్టింగ్‌ వాహనాలు, రూ.1.04 కోట్లతో 2 ఎస్కవేటర్‌ వాహనాలు, రూ.1.05 కోట్లతో 4 నీళ్ల స్ర్పింకర్‌ యంత్రాలు, నేషనల్‌ ఎయిర్‌ ప్రోగ్రాంలో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి తీసుకున్నాం.

రూ.23 కోట్లతో జీజీఎంపీ కింద 200 పనులు మొదలు పెట్టాం. రూ.13 కోట్లతో నాడు-నేడు ద్వారా 89 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. రూ.594 లక్షలతో జగనన్న హరితనగరాలు, రూ.41.71లక్షలతో అవెన్యూ ప్లాంటేషన్‌ చేపడతాం.

Updated Date - 2022-12-31T01:14:08+05:30 IST