ఎమ్మెల్యే బార్‌ వద్ద నిరసనకు యత్నం

ABN , First Publish Date - 2022-10-14T06:20:10+05:30 IST

ఎమ్మెల్యే మల్లాది విష్ణు అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దిల్‌ ఖుష్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది.

ఎమ్మెల్యే బార్‌ వద్ద నిరసనకు యత్నం

టీడీపీ నేతల హౌస్‌ అరె్‌స్ట 

8 మంది సీపీఎం నేతలపై కేసుల నమోదు 

అజిత్‌సింగ్‌నగర్‌, అక్టోబరు 13 : ఎమ్మెల్యే మల్లాది విష్ణు అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దిల్‌ ఖుష్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. జనావాసాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాల మధ్య ఉన్న బార్‌ ను తొలగించాలంటూ ప్రతిపక్షాల ఆందోళనలు, పోలీసుల అరె్‌స్టలతో గురువారం శివారు ప్రాంతంలో టె న్షన్‌ వాతావారణం నెలకొంది. విష్ణుకు చెందిన బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద నిరసనకు దిగుతామని టీడీపీ నేతలు ప్రకటించడంతో పలువురిని అజిత్‌సింగ్‌నగర్‌, సత్యనారాయణపురం, నున్న రూరల్‌ పోలీసులు ముందస్తుగా హౌస్‌ అరె్‌స్టలు చేశారు. ఎలాంటి ప్రకటనలు లేకుండా ముట్టడికి ప్రయత్నించిన పలువురు సీపీఎం అనుబంధ ఐద్వా మహిళా సంఘాల నేతలను మార్గమధ్యంలోనే అరెస్ట్‌ చేశారు. టీడీపీ నేతల హౌస్‌ అరె్‌స్టలు, ఐద్వా మహిళలపై కేసులు నమోదు వంటి చర్యలతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యవహారంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 

టీడీపీ నేతల హౌస్‌ అరె్‌స్ట

దిల్‌ ఖుష్‌ బార్‌ వద్ద నిరసన తెలపనున్నట్టు టీడీ పీ నేతలు ప్రకటించడంతో ఆ పార్టీ కీలక నేతలను పలు పోలీసు స్టేషన్ల పరిధిలో హౌస్‌ అరె్‌స్టలు చేశా రు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసా ద్‌, సెంట్రల్‌ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీతో పాటుగా పలువురు నేతలను గురువారం ఉదయమే హౌస్‌ అరె్‌స్టలు చేశారు. నేతలను ఇళ్ల నుంచి కదలనీయకపోవడంతో వారు తమ ఇళ్ల వద్దే నిరస న తెలిపారు. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే విష్ణు ఆదేశాల మేరకే పోలీసులు పనిచేస్తున్నారని, నిరసన తెలిపే హక్కు ను పోలీసులు హరిస్తున్నారన్నారు. అరె్‌స్టలు, గృహ నిర్బందాలతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. 

ఐద్వా మహిళల అరె్‌స్ట

దిల్‌ ఖుష్‌ బార్‌ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన పలువురు ఐద్వా మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బార్‌ వద్దకు వెళ్లే మార్గమధ్యంలోనే ఐద్వా జిల్లా కార్యదర్శి కె.శ్రీదేవి, ఐద్వా సిటీ కార్యదర్శి జి.ఝాన్సీలతో పాటుగా ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసి అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్రజలను తాగుబోతులుగా చేసి వారి కుటుంబాల్లో ఘో షకు కారణమయ్యే విధానాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు మానుకోవాలని హితవు పలికారు. తక్షణమే జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఏర్పా టు చేసిన బార్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-10-14T06:20:10+05:30 IST