వినాయక నిమజ్జనంలో విషాదం

ABN , First Publish Date - 2022-09-11T06:26:45+05:30 IST

వినాయక నిమజ్జనంలో విషాదం

వినాయక నిమజ్జనంలో విషాదం
రాములమ్మ, రామయ్య మృతదేహాలు

కరెంటు వైరు తగిలి ఉయ్యూరులో ఇద్దరు మృతి


ఉయ్యూరు, సెప్టెంబరు 10 : ఉయ్యూరులో శనివారం జరిగిన వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. 15వ వార్డులో వినాయక విగ్రహం నిమజ్జన ఊరేగింపులో విద్యుత్‌ వైరు తెగిపడి ఇద్దరు మృతిచెందారు. కాకాని గిరిజన కాలనీలో ఏర్పాటుచేసిన గణేశ్‌ విగ్రహం శనివారం సాయంత్రం ఊరేగింపుగా నిమజ్జనానికి వెళ్తుండగా, కాలనీకి చెందిన యడ్లపల్లి రాములమ్మ (62), యడ్లపల్లి రామయ్య (42) రోడ్డు పక్కన నిలుచున్నారు. ఆ సమయంలో విద్యుత్‌ వైరు తెగి రాములమ్మపై పడగా, షాక్‌కు గురై ఆమె కింద పడి చనిపోయింది. పక్కనే ఉన్న రామయ్య వైరు తీసేందుకు ప్రయత్నించగా, అతను కూడా షాక్‌ తగిలి మరణించాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 


Read more