పోలీసు బందోబస్తు నడుమ వినాయక నిమజ్జనం

ABN , First Publish Date - 2022-09-10T06:36:29+05:30 IST

పటమటలంకలోని తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడ్ని పోలీ సు బందోబస్తు మధ్య నిమజ్జనం చేశారు.

పోలీసు బందోబస్తు నడుమ వినాయక నిమజ్జనం

చిట్టినగర్‌ : పటమటలంకలోని తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడ్ని పోలీ సు బందోబస్తు మధ్య నిమజ్జనం చేశారు. కొద్దిరోజుల క్రితం మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై దాడి జరిగిన నేపథ్యంతో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం వినాయకుడికి పూజలు ని ర్వహించి, అన్నదానం చేశారు. కృష్ణా నదికి వరద  కారణంగా నిమజ్జనానికి అధికారులు అంగీకరించలే దు. సమీపంలోని కాల్వల్లో నిమజ్జనం చేయాలన్నారు. దీంతో పక్కనే ఉన్న కాల్వలో నిమజ్జనం చేశారు.

Read more