రోజుకో మలుపు తిరుగుతున్న లంకెల మల్లారెడ్డి కేసు..

ABN , First Publish Date - 2022-02-23T16:56:13+05:30 IST

బీజేపీ నాయకుడు లంకెల మల్లారెడ్డి హత్య కేసు విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

రోజుకో మలుపు తిరుగుతున్న లంకెల మల్లారెడ్డి కేసు..

విజయవాడ: బీజేపీ నాయకుడు  లంకెల మల్లారెడ్డి హత్య కేసు విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రజా ప్రతినిధి వియ్యంకుడిని తప్పించేందుకు కింది స్థాయిలో పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు వైసీపీలోని ఓ వర్గం నాయకులు  తీవ్రస్థాయిలో పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా ఎస్పీ కేసు విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధి శిబిరంలో గుబులు రేగుతోంది. 


విజయవాడ పార్లమెంట్ బీజేపీ కిషాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లంకెల మల్లారెడ్డి ఈ నెల 18న రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య జరిగి నాలుగు రోజులైనా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Read more