విజయవాడ రూరల్‌ అభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2022-08-16T06:34:20+05:30 IST

విజయవాడ రూరల్‌ అభివృద్ధే ధ్యేయం

విజయవాడ రూరల్‌ అభివృద్ధే ధ్యేయం
వైసీపీ ముఖ్య నేతల సమావేశంలో గొల్లపూడి ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్మా కోట్లు

ఫ వంశీ సహకారంతో రూ.2 కోట్లతో పనులు ఫ వైసీపీ ముఖ్య నేతల సమావేశంలో గొల్లపూడి ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్మా కోట్లు

విజయవాడ రూరల్‌, ఆగస్టు 15 : మండల అభివృద్ధే ధ్యేయంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని గొల్లపూడి ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు) సూచించారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వసంత కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ సహకారంతో మండలంలో ఇప్పటికే రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్‌ మండల గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం నున్నలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మండంలోని పలు గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టనున్న పనులపై చర్చించారు.  ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకులు కోనేరు సుబ్బారావు, వంగూరు శివ సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వారిని కోట్లు,  ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జడ్పీటీసీ సభ్యుడు కె సువర్ణరాజు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ వై నాగిరెడ్డి, గొల్లపూడి ఏఎంసీ చైర్మన్‌ కారంపూడి సురేష్‌, రూరల్‌ వైస్‌ ఎంపీపీ వేమూరి సురేష్‌,  జీతం శ్రీనివాసరావు, గన్నవరం ఎంపీపీ అనగాని రవి, సర్పంచ్‌లు శీలం రంగారావు, కొలుసు సముద్రవేణి, రాచమళ్ల పూర్ణచంద్రరావు, వరి శ్రీదేవి, బట్టా సోమయ్య.  పోలారెడ్డి చంద్రారెడ్డి,  కలకోటి బ్రహ్మానందరెడ్డి,  భీమవరపు శివరామిరెడ్డి, ముత్తారెడ్డి,  హనుమాన్‌, దేవగిరి ఓంకార్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T06:34:20+05:30 IST