కృష్ణా జిల్లాలో 25టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-02-23T17:06:22+05:30 IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

కృష్ణా జిల్లాలో 25టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

విజయవాడ: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం హనుమాన్ జంక్షన్‌కు చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. పామర్రు నుంచి కాకినాడ పోర్ట్‌కు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు హనుమాన్ జంక్షన్ సీఐ సతీష్ తెలిపారు. 

Read more