కోళ్ల ఫారాల్లో విజిలెన్స్ దాడులు
ABN , First Publish Date - 2022-08-18T06:06:37+05:30 IST
మండలంలోని కోళ్లఫారాల్లో రేషన్ బియ్యం నిల్వలపై బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 15.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.

15.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
వీరులపాడు : మండలంలోని కోళ్లఫారాల్లో రేషన్ బియ్యం నిల్వలపై బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 15.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన కోళ్ల ఫారాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విజిలెన్స్, రెవెన్యూ అదికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాలు
ఆరుగురికి గాయాలు
జగ్గయ్యపేట/వత్సవాయి, ఆగస్టు 17: పెనుగంచిప్రోలు నుంచి కోదాడ బయల్దేరిన ఆటోను మక్కపేట వద్ద రైల్వే అండర్‌పాస్ వద్ద వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కోదాడకు చెందిన రావులపాటి వెంకటరమణ కుటుంబ సభ్యులు బుధవారం పెనుగంచిప్రోలు వచ్చి తిరిగి కోదాడకు వెళు తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వినీల (31), సన్నీ (6), ఉమా (50)లను జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెనుగంచిప్రోలు పోలీసులకు ఆసుపత్రి వర్గాలు సమాచారం అందించాయి.
నందిగామ రూరల్ : మునగచర్ల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు బుధవారం వేగంగా వెళ్తున్నకారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీకొట్టి విజయ వాడ వైపు వెళ్లే రోడ్డులో పడింది. ఈ ఘటనలో విజయ వాడ వైపు వెళ్తున్న పెనుగంచిప్రోలు మండలం నవాబు పేటకు చెందిన కంచర్ల కిషోర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.