విద్యుత్‌ అధికారుల విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-10-07T06:07:02+05:30 IST

విద్యుత్‌ అధికారుల విజిలెన్స్‌ తనిఖీలు

విద్యుత్‌ అధికారుల విజిలెన్స్‌ తనిఖీలు

ఉయ్యూరు, అక్టోబరు 6: మండలంలో విద్యుత్‌ అధికారులు గురువారం విజిలెన్స్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదనపు లోడు వాడుతున్న వినియోగదారుల నుంచి రూ.3,96,000 జరిమానా విధించినట్టు రూరల్‌ ఏఈ ఎస్‌వీవీ సత్యనారాయణ తెలి పారు. ఉయ్యూరు డివిజన్‌ ఈఈ సీహెచ్‌ రాంబొట్లు, విజిలెన్స్‌ ఈఈ కె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు 33 బృందాలుగా ఏర్పడి 2,179 గృహవినియోగ, 33 వాణిజ్య సముదాయ సర్వీసులను తనిఖీ చేశారు. 136 సర్వీసుల్లో అదనపులోడు వాడుతున్న వారికి జరిమానా విధించినట్టు వివరించారు. విద్యుత్‌ అక్రమంగా విని యోగిస్తే కేసులు నమోదుచేసి జరిమానాతోపాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈఈ పేర్కొన్నారు. ఉయ్యూరు డీఈ ఎంవీవీ రామకృష్ణ, రూరల్‌ ఏఈ సత్యనారాయణ, డివిజన్‌ పరిధి డీఈలు, ఏఈలు, జేఈలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T06:07:02+05:30 IST