విజయీభవ!

ABN , First Publish Date - 2022-12-31T01:05:39+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మృతికి ఏపీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఆర్‌.మల్లికార్జునరావు తన పెయింటింగ్‌ ద్వారా సంతాపం తెలిపారు.

విజయీభవ!
హీరాబెన్‌ మృతికి సంతాపసూచికంగా మల్లికార్జునరావు గీసిన చిత్రం

మోదీని తల్లి హీరాబెన్‌ ఆశీర్వదిస్తున్నట్టు పెయింటింగ్‌

హీరాబెన్‌ మృతికి చిత్రకారుడు, ఏపీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మల్లికార్జునరావు సంతాపం

విజయవాడ కల్చరల్‌, డిసెంబరు 30: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మృతికి ఏపీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఆర్‌.మల్లికార్జునరావు తన పెయింటింగ్‌ ద్వారా సంతాపం తెలిపారు. పెయింటింగ్‌లో దేశాన్ని ఉన్నతపథం వైపు మోదీ నడిపించేలా విజయీభవ అని దీవిస్తున్నట్టు, దేశం కోసం దీర్ఘకాలం జీవించాలని హీరాబెన్‌ ఆశీర్వదిస్తున్నట్లు చిత్రీకరించారు. మోదీ ప్రపంచ శాంతి కోసం ప్రయత్నించడాన్ని సూచించేలా భరతమాత నీలిరంగు జెండాను పట్టుకోవడం, నెమలి సొగసు, పావురం ప్రశాంతత, సింహంలా బలాన్నీ, స్థిరమైన తెలివితో ఏనుగులా జీవించి దేశాన్ని గొప్ప దేశాల్లో ఒకటిగా మార్చాలనే మోదీ కాంక్షను చిత్రంలో జంతువుల ద్వారా సూచిస్తూ ఆయన పెయింటింగ్‌ వేశారు. తన కార్యాలయంలో పెయింటింగ్‌ను శుక్రవారం ఆవిష్కరించారు.

Updated Date - 2022-12-31T01:05:39+05:30 IST

Read more