14 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరం

ABN , First Publish Date - 2022-03-18T06:38:58+05:30 IST

14 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరం

14 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరం
నిరసన తెలుపుతున్న వెటర్నరీ విద్యార్థులు

గన్నవరం, మార్చి 17: తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 14 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నా స్పందించకపోవటం బాధాకరమని, వెటర్నరీ విద్యార్ధుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని,  విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం ఎన్టీఆర్‌ వెటర్నరీ కళాశాల విద్యార్థులు గురువారం ఆందోళనను కొనసాగించారు. రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్లను అప్‌గ్రేడ్‌ చేస్తే నిరుద్యోగ వెటర్నరీ విద్యార్థులకు జాబ్‌లు వస్తాయని, స్టయిఫండ్‌ పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. సంచార పశువైద్యశాలల్లో ప్రభుత్వమే శాశ్వత ప్రాతిపాదికన డాక్టర్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. నరేందర్‌ కుమార్‌రెడ్డి, రవితేజ, రవీంద్ర, హేమంత్‌కుమార్‌, తేజ, లిఖిత, మణిచందన, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-18T06:38:58+05:30 IST