చిరు వ్యాపారులకు జగన్‌రెడ్డి చేసింది శూన్యం : వర్ల ధ్వజం

ABN , First Publish Date - 2022-08-04T06:35:57+05:30 IST

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చిరు వ్యాపారులకు ఎలాంటి సాయం అందించండం లేదని పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్ల కుమార్‌ రాజా విమర్శించారు.

చిరు వ్యాపారులకు జగన్‌రెడ్డి చేసింది శూన్యం : వర్ల ధ్వజం

పెదపారుపూడి :  జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చిరు వ్యాపారులకు  ఎలాంటి సాయం అందించండం లేదని పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్ల కుమార్‌ రాజా విమర్శించారు. మండలంలోని వెంట్రప్రగడలో బుధవారం చిరు వ్యాపారులను వర్ల కుమార్‌ రాజా కలుసుకుని జగనన్న తోడు ఎంత మందికి వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. నిబంధనల పేరుతో జగనన్న తోడు రాకుండా చేశారని చిరు వ్యాపారులు వాపోయారు.  వర్ల కుమార్‌ రాజా మాట్లాడుతూ జగనన్న తోడులో కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతం ఉండగా, పత్రికలకు ఇచ్చిన ప్రకటనలో మాత్రం ఎక్కడా కేంద్ర ప్రభుత్వం పేరు కూడా ప్రస్తావించటం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు జగన్మోహన్‌ రెడ్డి మోసాన్ని గమనించి రాబోయే రోజుల్లో ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. టీడీపీ మండల అధ్యక్షులు చలసాని రమేష్‌ చౌదరి, గొరిపర్తి రవికుమార్‌, కలపాల కిషోర్‌, రాధాకృష్ణ, కూచిపూడి ఆదిత్య, సత్యనారాయణ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-04T06:35:57+05:30 IST