ఊరూరా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
ABN , First Publish Date - 2022-08-12T06:14:23+05:30 IST
పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండాతో గురువారం ర్యాలీ నిర్వహించారు.

తిరువూరు, ఆగస్టు 11 : పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండాతో గురువారం ర్యాలీ నిర్వహించారు. తిరువూరు పోలీస్ సర్కిల్, తిరువూరు పూర్వవిద్యార్ధుల సంఘం(తొసా) ఆధ్వర్యంలో సీఐ ఆర్.భీమరాజు, ఎస్సైలు, సిబ్బంది, తోసా సభ్యులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కమిషనర్ శర్మ, గ్రంథాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లైబ్రరీయన్ బీరం వెంకటరమణ, సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు.
కంచికచర్లలో
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మిక్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. చెరువు కట్ట సెంటర్ నుంచి పెట్రోల్ బంక్ సెంటర్ వరకు జాతీయ రహదారిపై విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో నందిగామ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐవీ నాగేంద్రకుమార్, ఎస్సై సుబ్రహ్మణ్యం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ వంశీ కిరణ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి.రాజేష్ పాల్గొన్నారు.
నందిగామ రూరల్‌లో
లింగాలపాడులో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అరుణ్‌కుమార్ మాట్లా డుతూ మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సర్పంచ్ బొల్లినేని పద్మజ, ఎంపీటీసీ సభ్యుడు నరసింహారావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏపీవో రమాదేవి, హెచ్ఎం రాంబాబు, బొల్లినేని శ్రీనివాసరావు, పారుపల్లి హరిబాబు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తొర్లికొండ సీతారామయ్య, బండారు కేదార్నాథ్, ముక్కపాటి నరసింహా రావు, వందేమాతరం అశోక్, తదితరులు పాల్గొన్నారు.
మైలవరం రూరల్‌లో
గురువారం తిరంగా మార్చ్ నిర్వహించారు. కార్యదర్శి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఏపీవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చంద్రాల పేరంటాల చెరువు, తోలుకోడు భద్రమ్మ కుంట, పడమర చెరువుల వద్ద ర్యాలీలు జరిపారు. అగ్రికల్చర్ ఏడీ శ్రీనివాసరావు, సర్పంచ్ జొన్నలగడ్డ జ్యోతి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.