కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆకస్మిక తనీఖీ

ABN , First Publish Date - 2022-12-07T00:52:01+05:30 IST

కలెక్టర్‌ రంజిత్‌బాషా మంగళవారం కలెక్టరేట్‌లోని పలు సెక్షన్‌లను ఆకస్మికంగా చేశారు. కలెక్టరేట్‌లోని పరిపాలనా విభాగం, మెజిస్టీరియల్‌ విభాగం, ల్యాం డ్‌ సెక్షన్‌లలో పనిచేస్తున్న ఉద్యోగుల హాజరును పరిశీలించారు.

కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆకస్మిక తనీఖీ

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కలెక్టర్‌ రంజిత్‌బాషా మంగళవారం కలెక్టరేట్‌లోని పలు సెక్షన్‌లను ఆకస్మికంగా చేశారు. కలెక్టరేట్‌లోని పరిపాలనా విభాగం, మెజిస్టీరియల్‌ విభాగం, ల్యాం డ్‌ సెక్షన్‌లలో పనిచేస్తున్న ఉద్యోగుల హాజరును పరిశీలించారు. ఈ సెక్షన్లలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అవుట్‌ సోర్స్‌ పద్దతిలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు తదితర అంశాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యాలయాన్ని కలెక్టర్‌ పరిశీలన చేశారు. ఈ ఈ కార్యాలయంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట డీఆర్వో ఎం వెంకటేశ్వర్లు, కలెక్టరేట్‌ ఎవో జీవీ ప్రసాద్‌, వివిద సెక్షన్ల సూపరిండెంట్లు, హరనాధ్‌, రాధిక, రజనీ కుమారి, సంషున్నీసాబేగం తదితరులున్నారు.

మచిలీపట్నం టౌన్‌ : ఈనెల 25లోగా అప్రోచ్‌, అంతర్గత రోడ్ల లెవెలింగ్‌ పనులు పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులకు ఆదేశించారు. కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు. లే అవుట్లలో అంతర్గత, అప్రోచ్‌ రోడ్లపై మునిసిపల్‌, పంచాయతీ అధికారులు దృష్టి సారించాలన్నారు. లే అవుట్లకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలో 94 వేల ఇళ్లు నిర్మించాల్సి ఉండగా 7 వేలు మాత్రమే పూర్తయ్యాయన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ.కిషోర్‌, హౌసింగ్‌ ఇన్‌చార్జి పీడీ జీవీ సూర్యనారాయణ, పీఆర్‌ ఎస్‌ఈ వీరాస్వామి, డీపీవో నాగేశ్వర నాయక్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ సత్యనారాయణ, విద్యుత్‌శాఖ డీఈ వెంకట కృష్ణారెడ్డి, డీఎల్‌డీవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు

వన్‌టౌన్‌, డిసెంబరు 6 : వేధింపుల నుంచి రక్షణ పొందేలాచట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ దిల్లీరావు అన్నారు. మహిళా లైంగిక వేధింపు నివారణ, నిషేధం, దిద్దుబాటు-2013 (ఇన్‌ సైట్స్‌ ఆన్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఉమెన్‌ యట్‌ వర్క్‌ప్లేస్‌) అంశంపై మంగళవారం కొత్తపేటలోని కాకరపర్తి భావనారాయణ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మహిళలు పనిచేస్తున్న కార్యాలయాలలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించారన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సంస్థల్లో లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. స్త్రీ సంక్షేమ జిల్లా అధికారి ఉమాదేవి మాట్లాడుతూ, మహిళల అర్థిక సాధికారిత, బాల్య వివాహాల నిర్మూలన, మహిళా చట్టాలు హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మార్పు సంస్థ డైరెక్టర్‌ సూయజ్‌, కళాశాల సైకాలజిస్ట్‌ దేవిరెడ్డి కళ్యాణి, కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ టి.శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ వి.నారాయణరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తే ఉత్తమ ఫలితాలు

వన్‌టౌన్‌ : పాఠ్యాంశాలపై పట్టు సాధించినప్పుడే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందగలరని కలెక్టర్‌ దిల్లీరావు అన్నారు. వన్‌టౌన్‌లోని నగరపాలక సంస్థ గాంధీ మునిసిపల్‌ హైస్కూల్‌ను మంగళవారం కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవతరగతి విద్యార్థులకు గణితంపై ప్రావీణ్యాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులను పరీక్షలో మంచి మార్కులు సాధించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ఇటీవల నిర్వహించిన ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌ పరీక్షలో హిందీ సబ్జెక్టులో 20కి 19 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన తేజేశ్వరరావును కలెక్టర్‌ అభినందించారు.

Updated Date - 2022-12-07T00:52:03+05:30 IST